Friday, 25 September 2026
  • Home  
  • ఇబ్రహీంపట్నం మండలం పరిషత్ పాలకమండలి పదవి కాలం పూర్తి
- ఎన్ టి ఆర్ జిల్లా

ఇబ్రహీంపట్నం మండలం పరిషత్ పాలకమండలి పదవి కాలం పూర్తి

*ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాలకమండలి పదవీ కాలం పూర్తి* *నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన* *మాజీలైన 10 మంది ఎంపీటీసీ సభ్యులు* *రాజకీయాలకు అతీతంగా మచ్చలేని పాలన అందించిన ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న* ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 24: భారత్ న్యూస్… ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాలకమండలి ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. దీంతో *గురువారం (నేటి) నుండి మండలంలో స్పెషల్ ఆఫీసర్ పాలన అమలులోకి రానుంది.* పాలకమండలి గడువు పూర్తి కావడంతో మండలంలోని 10 మంది ఎంపీటీసీ సభ్యులు మాజీలుగా మారారు. తమ ఐదేళ్ల పదవీ కాలంలో మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో తమ వంతు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, అధికారులకు మాజీ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. *తనదైన మార్కు చూపించిన ఎంపీపీ…* *నాడు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షురాలిగా రెండున్నర సంవత్సరాల ఒప్పందంపై ఎన్నికైన పాలడుగు జ్యోత్స్న దుర్గాప్రసాద్,* తన ఐదేళ్ల పదవీ కాలంలో చెరగని ముద్ర వేశారు. తొలినాళ్లలో ఇంటి నుంచి బయటకు వచ్చిన సాధారణ గృహిణిలా బిడియంగా కనిపించినప్పటికీ, అనతికాలంలోనే రాజకీయాలపై పూర్తి పట్టు సాధించారు. విమర్శలకు చిరునవ్వే సమాధానంగా ఇటు పరిపాలనలో, అటు రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకెళ్లారు. రెండున్నర సంవత్సరాలు వైఎస్సార్‌సీపీలో, మరో రెండున్నర సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా కొనసాగిన ఆమె… రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మచ్చలేని స్వచ్ఛమైన పాలన అందించి ప్రత్యేకత చాటుకున్నారు. ప్రజా హృదయాలలో చెరగని ముద్ర… *తన దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ పరిష్కారం చూపించడంలో జ్యోత్స్న ముందుండేవారు.* మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే ప్రతి సామాన్యుడిని ఆత్మీయంగా పలకరిస్తూ, సమస్యలను పరిష్కరించి అందరి హృదయాలలో ఆత్మీయ నాయకురాలిగా స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలిరావడమే ఆమెకు అందరితో ఉన్న అనుబంధానికి నిదర్శనం. రాజకీయ నాయకురాలిగానే కాకుండా, ఆత్మీయతకు ప్రతిరూపంగా నిలిచిన పాలడుగు జ్యోత్స్న పేరు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాలకమండలి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని స్థానికులు కొనియాడారు.

*ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాలకమండలి పదవీ కాలం పూర్తి*
*నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన*
*మాజీలైన 10 మంది ఎంపీటీసీ సభ్యులు*
*రాజకీయాలకు అతీతంగా మచ్చలేని పాలన అందించిన ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న*

ఎన్టీఆర్ జిల్లా.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 24:
భారత్ న్యూస్…

ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాలకమండలి ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. దీంతో *గురువారం (నేటి) నుండి మండలంలో స్పెషల్ ఆఫీసర్ పాలన అమలులోకి రానుంది.*
పాలకమండలి గడువు పూర్తి కావడంతో మండలంలోని 10 మంది ఎంపీటీసీ సభ్యులు మాజీలుగా మారారు.
తమ ఐదేళ్ల పదవీ కాలంలో మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో తమ వంతు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, అధికారులకు మాజీ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
*తనదైన మార్కు చూపించిన ఎంపీపీ…*
*నాడు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షురాలిగా రెండున్నర సంవత్సరాల ఒప్పందంపై ఎన్నికైన పాలడుగు జ్యోత్స్న దుర్గాప్రసాద్,*
తన ఐదేళ్ల పదవీ కాలంలో చెరగని ముద్ర వేశారు.
తొలినాళ్లలో ఇంటి నుంచి బయటకు వచ్చిన సాధారణ గృహిణిలా బిడియంగా కనిపించినప్పటికీ, అనతికాలంలోనే రాజకీయాలపై పూర్తి పట్టు సాధించారు. విమర్శలకు చిరునవ్వే సమాధానంగా ఇటు పరిపాలనలో, అటు రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకెళ్లారు. రెండున్నర సంవత్సరాలు వైఎస్సార్‌సీపీలో, మరో రెండున్నర సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా కొనసాగిన ఆమె… రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మచ్చలేని స్వచ్ఛమైన పాలన అందించి ప్రత్యేకత చాటుకున్నారు.
ప్రజా హృదయాలలో చెరగని ముద్ర…
*తన దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ పరిష్కారం చూపించడంలో జ్యోత్స్న ముందుండేవారు.*
మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే ప్రతి సామాన్యుడిని ఆత్మీయంగా పలకరిస్తూ, సమస్యలను పరిష్కరించి అందరి హృదయాలలో ఆత్మీయ నాయకురాలిగా స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలిరావడమే ఆమెకు అందరితో ఉన్న అనుబంధానికి నిదర్శనం. రాజకీయ నాయకురాలిగానే కాకుండా, ఆత్మీయతకు ప్రతిరూపంగా నిలిచిన పాలడుగు జ్యోత్స్న పేరు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాలకమండలి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని స్థానికులు కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.