Tuesday, 22 September 2026
  • Home  
  • ఇందిరానగర్ ఫేజ్-2లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు
- రంగారెడ్డి

ఇందిరానగర్ ఫేజ్-2లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

వనస్థలిపురం: ఇందిరానగర్ ఫేజ్-2లో భజన మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఉప్పల వెంకటరమణ, వనజ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అన్నదాతలుగా వ్యవహరించారు. గత మూడు సంవత్సరాలుగా వీరి సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ కాలనీవాసులు కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించారు.భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 29 ఏళ్లుగా వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన, చవితి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25న 12వ రోజు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది వినాయక లడ్డూ వేలం పాట రూ.65 వేలు పలికిందని, ఈ ఏడాది కూడా భక్తుల ఆసక్తిని బట్టి వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.అన్నదాతలు ఉప్పల వెంకటరమణ, వనజ దంపతులు, వారి కుటుంబ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ యూత్ అధ్యక్షులు బరగడ శ్రవణ్ కుమార్ (బాబీ), ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముద్దగౌని ధన్‌పాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.