Sunday, 27 September 2026
  • Home  
  • ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చే ఘనంగా ప్రారంభం
- జనగాం

ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చే ఘనంగా ప్రారంభం

శనివారం, జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీ 12వ వార్డులో గల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా *ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి* హాజరై, డోర్నాల లావణ్య శ్రీనివాస్, కందగట్ల మమత, చుంచు సుమలత రాజ్ కుమార్, బిర్రు భవాని మల్లేష్, కొండ ధనలక్ష్మి లబ్ధిదారుల ఇళ్లకు గృహ ప్రవేశం చేశారు. అలాగే లబ్ధిదారులకు నూతన వస్త్రాలను *మంత్రివర్యులు* అందజేశారు. అదే విధంగా చేనేత కుటుంబాలు మగ్గాలపై నేస్తున్న వస్త్రాలను పరిశీలించిన *మంత్రి*, వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. సంప్రదాయ చేనేతకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో చేనేత కార్మికుల పాత్ర ఎంతో కీలకమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో *జనగామ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు* తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

శనివారం, జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీ 12వ వార్డులో గల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా *ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి* హాజరై, డోర్నాల లావణ్య శ్రీనివాస్, కందగట్ల మమత, చుంచు సుమలత రాజ్ కుమార్, బిర్రు భవాని మల్లేష్, కొండ ధనలక్ష్మి లబ్ధిదారుల ఇళ్లకు గృహ ప్రవేశం చేశారు. అలాగే లబ్ధిదారులకు నూతన వస్త్రాలను *మంత్రివర్యులు* అందజేశారు.
అదే విధంగా చేనేత కుటుంబాలు మగ్గాలపై నేస్తున్న వస్త్రాలను పరిశీలించిన *మంత్రి*, వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. సంప్రదాయ చేనేతకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో చేనేత కార్మికుల పాత్ర ఎంతో కీలకమని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో *జనగామ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు* తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.