తొర్రూరు( మహబూబాబాద్ జిల్లా తెలంగాణ) ఆగస్టు 9 (పున్నమి ప్రతినిధి ) ఆర్యవైశ్య మహాసభ మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం తొరూరు డివిజన్ కేంద్రంలోని రామా ఉపేందర్ గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు తల్లాడ వెంకట రామారావు అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి పొద్దుటూరి గౌరీ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలోని 18 మండలాల్లో ఆర్యవైశ్య కులస్తుల సమగ్ర కుటుంబ సర్వేను సంబంధిత మండల బాధ్యులు వేగవంతంగా చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సర్వే పత్రాలను సంబంధిత మండల బాధ్యులకు అందజేశారు. 18 సంవత్సరాలు నిండిన ఆర్యవైశ్య యువతి యువకులకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ శాశ్వత సభ్యత్వలను నమోదు చేయించాలని తెలిపారు. మండలాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించారు. సభ్యత నమోదుకు ప్రత్యేక కమిటీని నియమించడం జరిగిందని మండలంలో పనిచేసే కార్యవర్గం సభ్యత నమోదు కమిటీ చైర్మన్ మాలే యోగేశ్వరరావుకు వివరాలు అందజేయాలని సూచించారు. సంఘ బలోపేతం కోసం కృషి చేస్తూ సభ్యత్వ నమోదును పూర్తి చేసి కమిటీల నియామకాన్ని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఆర్యవైశ్య కులస్తుల సంఖ్యను తేల్చే క్రమంలో మనం చేపట్టే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను నిరుపేదలకు వర్తింపజేసేందుకు దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం పేద ఆర్యవైశ్య కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అరులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, ఇతర పథకాలను అందించాలని కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచులుగా, కౌన్సిలర్లుగా గెలుపొందిన ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులు,వి రాష్ట్ర మహాసభలో పదవులు పొందిన వారిని శాలువా, మెమొంటోలతో సత్కరించారు. జిల్లా కార్యవర్గ సమావేశానికి వసతి, భోజన సౌకర్యం కల్పించిన దాతలు రామ ఉపేందర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి నాళ్ల నరసింహారావు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మహిళ విభాగం ఉపాధ్యక్షురాలు వజినపల్లి దీప అనిల్, జిల్లా కార్యదర్శి వేమిశెట్టి కిషోర్ కుమార్, కోశాధికారి సామ రామ్మూర్తి, జిల్లా రైస్ మిల్లర్స్ ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు ఓలం కృష్ణమూర్తి, వేమిశెట్టి సోమయ్య, సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మాలే మోహన్ రావు, సర్పంచులు లింగమూర్తి, కృష్ణమూర్తి, కౌన్సిలర్ అరుణ, యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు మిత్తింటి హరీష్, ప్రోగ్రాం కన్వీనర్ వజినపల్లి అనిల్ కుమార్, కో కన్వీనర్లు చిదురాల చంద్రయ్య, మచ్చ సోమయ్య, బిజ్జాల అనిల్ కుమార్, చిదురాల రవి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మచ్చ సురేష్ జిల్లా సాంస్కృతిక కమిటీ కన్వీనర్ , ఇమ్మడి రాంబాబు, చీదర మహేష్, చౌడవరపు రాము, విశ్వ ప్రసాద్, శ్రవణ్ కుమార్, శ్రీనివాస్, వేణుమాధవ్, రమేష్, తల్లాడ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య కుటుంబాల సర్వే చేపట్టాలి సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొద్దుటూరి గౌరీ శంకర్ ..