హైదరాబాద్: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు డిపోల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ గౌరవ అధ్యక్షులు TVR నేతృత్వంలో, యూనియన్ రాష్ట్ర సలహాదారు ప్యారం సుభాష్ ఆధ్వర్యంలో మిదాని, ఫరూక్నగర్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మహేశ్వరం డిపోల్లో కార్మికులను కలిసి యూనియన్ విధానాలను వివరించారు.
ఈ సందర్భంగా యూనియన్‌కు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులను నాయకులు కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, హక్కులు, ఉద్యోగ భద్రత కోసం యూనియన్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
TGSRTC SC, ST Employees Welfare Association వ్యవస్థాపకులు ప్యారం సుభాష్ ఇటీవల బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన చేరికతో యూనియన్ మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర అధ్యక్షుడు సాజిద్ మహమ్మద్ అన్నారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్, రాష్ట్ర చైర్మన్ CH సంపత్ ముదిరాజ్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ గౌడ రవికిరణ్, ఉపాధ్యక్షులు కుమార్ కుర్మ, ప్రచార కార్యదర్శి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



