Sunday, 17 May 2026
  • Home  
  • ఆదివారం పారిశుద్య కార్మికులకు సెలవా..? ఖమ్మం నగరంలో చెత్త సమస్యపై స్థానికుల ఆగ్రహం
- ఖమ్మం

ఆదివారం పారిశుద్య కార్మికులకు సెలవా..? ఖమ్మం నగరంలో చెత్త సమస్యపై స్థానికుల ఆగ్రహం

ఖమ్మం మే (పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి) ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలోని పాత కృష్ణవేణి పాఠశాలకు వెళ్లే మూల మలుపు వద్ద సోమవారం నుండి శనివారం వరకు పరిసరాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి. అయితే ఆదివారం వచ్చేసరికి అదే ప్రాంతం చెత్తచెదారాలతో నిండిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ, అక్కడి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రతి వారం ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, ఆదివారం రోజున పారిశుద్య కార్మికులు వచ్చి శుభ్రపరిచే పనులు చేయకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. “ఆదివారం పారిశుద్య కార్మికులకు సెలవా..? నగర పరిశుభ్రతపై కార్పొరేషన్ నిర్లక్ష్యం ఎందుకు..?” అంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఖమ్మం మే
(పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి)

ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలోని పాత కృష్ణవేణి పాఠశాలకు వెళ్లే మూల మలుపు వద్ద సోమవారం నుండి శనివారం వరకు పరిసరాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి. అయితే ఆదివారం వచ్చేసరికి అదే ప్రాంతం చెత్తచెదారాలతో నిండిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ, అక్కడి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రతి వారం ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, ఆదివారం రోజున పారిశుద్య కార్మికులు వచ్చి శుభ్రపరిచే పనులు చేయకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

“ఆదివారం పారిశుద్య కార్మికులకు సెలవా..? నగర పరిశుభ్రతపై కార్పొరేషన్ నిర్లక్ష్యం ఎందుకు..?” అంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.