Wednesday, 16 September 2026
  • Home  
  • ఆత్మకూరులో రోడ్డుపై మురుగునీరు.. ప్రజలకు ఇబ్బందులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో రోడ్డుపై మురుగునీరు.. ప్రజలకు ఇబ్బందులు

ఆత్మకూరు సెప్టెంబర్ 15 (పున్నమి ప్రతినిధి ) ఆత్మకూరు: పట్టణంలోని షిర్డీ సాయిరాం జూనియర్, డిగ్రీ కళాశాలకు వెళ్లే రహదారిపై మురుగునీరు ప్రవహిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరి నిలిచిపోతుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే విద్యార్థులు, వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై మురుగునీరు నిలవడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురుగునీటి ప్రవాహాన్ని అరికట్టి, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఆత్మకూరు సెప్టెంబర్ 15 (పున్నమి ప్రతినిధి )

ఆత్మకూరు: పట్టణంలోని షిర్డీ సాయిరాం జూనియర్, డిగ్రీ కళాశాలకు వెళ్లే రహదారిపై మురుగునీరు ప్రవహిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరి నిలిచిపోతుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే విద్యార్థులు, వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై మురుగునీరు నిలవడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురుగునీటి ప్రవాహాన్ని అరికట్టి, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.