Saturday, 12 September 2026
  • Home  
  • ఆత్మకూరు డీఎస్పీని కలిసిన వాల్మీకి సంఘం నాయకులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు డీఎస్పీని కలిసిన వాల్మీకి సంఘం నాయకులు

టి.వెంకటేశ్వర్లుకు ఘన సన్మానం.. శుభాకాంక్షలు తెలిపిన నేతలు ఆత్మకూరు, సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు డీఎస్పీగా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టి.వెంకటేశ్వర్లును శనివారం నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన వాల్మీకి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీ టి.వెంకటేశ్వర్లుకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనను కలుసుకుని అభినందనలు తెలియజేయడం ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం అభివృద్ధి, సామాజిక సమస్యలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై నాయకులు డీఎస్పీతో చర్చించినట్లు తెలిపారు. పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువగా పనిచేసి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఆకాంక్షించారు. డీఎస్పీని కలిసిన వారిలో కడప జిల్లా మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి అధ్యక్షులు మానం ఆంజనేయులు వాల్మీకి, నెల్లూరు జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామ స్థాయిలకు చెందిన బోయ వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీకి తమ సంఘం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు.

టి.వెంకటేశ్వర్లుకు ఘన సన్మానం.. శుభాకాంక్షలు తెలిపిన నేతలు

ఆత్మకూరు, సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు డీఎస్పీగా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టి.వెంకటేశ్వర్లును శనివారం నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన వాల్మీకి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీ టి.వెంకటేశ్వర్లుకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనను కలుసుకుని అభినందనలు తెలియజేయడం ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం అభివృద్ధి, సామాజిక సమస్యలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై నాయకులు డీఎస్పీతో చర్చించినట్లు తెలిపారు. పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువగా పనిచేసి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఆకాంక్షించారు. డీఎస్పీని కలిసిన వారిలో కడప జిల్లా మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి అధ్యక్షులు మానం ఆంజనేయులు వాల్మీకి, నెల్లూరు జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామ స్థాయిలకు చెందిన బోయ వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీకి తమ సంఘం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.