భూమి వాతావరణంలోకి అత్యంత వేగంగా ప్రవేశించే ఉల్కా శకలాలు ఒక్కసారిగా ప్రకాశవంతమైన అగ్నిగోళాలుగా కనిపించినప్పుడు వాటిని ‘బోలైడ్స్’ అని పిలుస్తారు. ఇవి సాధారణ ఉల్కల కంటే పెద్దవిగా ఉండి, వాతావరణంలో ప్రవేశించే సమయంలో గాలితో ఘర్షణ చెందడం వల్ల భారీ కాంతిని విడుదల చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇవి పేలిపోవడంతో శక్తివంతమైన షాక్వేవ్లు ఏర్పడి పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. 2013లో రష్యాలోని చెల్యాబిన్స్క్ ప్రాంతంలో సంభవించిన బోలైడ్ పేలుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవనాల అద్దాలు పగిలిపోవడంతో పాటు వెయ్యికి పైగా మంది గాయపడ్డారు. ఖగోళ శాస్త్రవేత్తలు ఇటువంటి ఘటనలను పరిశీలిస్తూ భూమికి సంభవించే ప్రమాదాలను అంచనా వేస్తున్నారు.

ఆకాశంలో వెలుగులు విరజిమ్మే ‘బోలైడ్స్’ అంటే ఏమిటి?