ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ చినబాబు.
పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం
పలమనేరు నియోజకవర్గం వి. కోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ చినబాబు ఆవేదన వ్యక్తంచేసారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇలాంటి అమానవీయ ఘటన జరగడం అత్యంత శోచనీయమని,
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన విలేకరిపై జరిగిన ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించకూడదని, విలేకరి
జగన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు


