పున్నమి న్యూస్ ప్రతినిధి (జూలై 09)
పులివెందుల
తేదీ: 09-07-2026
స్థలం: పులివెందుల
అసెంబ్లీ నియోజకవర్గ ఆర్థిక ప్రొఫైలింగ్‌పై అధికారులకు శిక్షణ కార్యక్రమం.
గౌరవ జిల్లా కలెక్టర్, వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆదేశాల మేరకు GDDP/GMDP Capacity Building Training Programme లో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గ ఆర్థిక ప్రొఫైలింగ్ (Constituency Economic Profiling) పై శిక్షణ కార్యక్రమం నేడు పులివెందుల మున్సిపల్ కమిషనర్ కార్యాలయం సమావేశ హల్ నందు పులివెందుల నియోజకవర్గ ప్రత్యేక అధికారి డా.G. రాజ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారి డా.G రాజ్యలక్ష్మి PD DRDA మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర @2047 లక్ష్యాల సాధనలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సమగ్ర ఆర్థిక ప్రొఫైలింగ్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి శాస్త్రీయ ప్రణాళిక రూపొందించవచ్చని తెలిపారు.
ఈ శిక్షణలో PAHLE Indian Foundation నుండి వచ్చిన మాస్టర్ ట్రైనర్లు Havalik Reddy,Palak Desai , పాల్గొని నియోజకవర్గ ఆర్థిక ప్రొఫైలింగ్ లక్ష్యాలు, శాఖల వారీ డేటా సేకరణ, ప్రశ్నావళి పూరింపు, డేటా నాణ్యత, విశ్లేషణ, నివేదికల తయారీ, సమన్వయ విధానాలపై అధికారులకు సవివరంగా శిక్షణ అందించారు.
నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ప్రతి శాఖ అందించే సమాచారం అత్యంత కీలకమని, నిర్ణీత గడువులోగా నాణ్యమైన సమాచారాన్ని సమర్పించాలని ట్రైనర్లు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పులివెందుల DLDO, మండల ప్రత్యేక అధికారులు, MPDOs , మున్సిపల్ కమిషనర్, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, విద్య, గణాంక, పరిశ్రమలు, పంచాయతీరాజ్, RWS, హౌసింగ్, DWMA, వెలుగు, ఇరిగేషన్, ICDS అధికారులు పాల్గొన్నారు. “CVAP Unit, Pulivendula Constituency ఆధ్వర్యంలో కార్యక్రమ సమన్వయం జరిగింది”
ధన్యవాదములు..
KP.Thippeswamy,
Young Professional,
Pulivendula Constituency.






