Thursday, 17 September 2026
  • Home  
  • అసాంఘిక కార్యక్రమాల నివారణకు మరియు పాఠశాల భద్రతకు పాఠశాలలో ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు – ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గంట రవితేజ
- విశాఖపట్నం

అసాంఘిక కార్యక్రమాల నివారణకు మరియు పాఠశాల భద్రతకు పాఠశాలలో ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు – ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గంట రవితేజ

యువనేత గంట రవితేజ సొంత నిధులతో ఏర్పాటు – పేరెంట్స్ కమిటీ చైర్మన్ పెంకి శంకర్ ఆధ్వర్యంపై అభినందనలు విశాఖపట్నం జిల్లా మధురవాడ( పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 16:: మధురవాడ సునీల్ శర్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు,కే. గీతాదేవి గారి అభ్యర్థన మేరకు, పాఠశాల విద్యార్థుల భద్రతతో పాటు అసాంఘిక కార్యక్రమాల నివారణ నిమిత్తం పాఠశాల పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పేరెంట్స్ కమిటీ చైర్మన్ పెంకి శంకర్, వైస్ చైర్మన్ R. లావణ్య గారు, ఇతర కమిటీ సభ్యులు మరియు తల్లిదండ్రులు ప్రత్యేకంగా కృషి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి తనయుడు, యువనేత గంట రవితేజ గారు తన సొంత నిధులతో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం పట్ల పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత, పాఠశాల ఆస్తుల పరిరక్షణ, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు కే. గీతాదేవి గారి అభ్యర్థనకు స్పందించి, తల్లిదండ్రుల కోరిక మేరకు చర్యలు చేపట్టి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన యువనేత గంట రవితేజ గారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చొరవ చూపిన పేరెంట్స్ కమిటీ చైర్మన్ పెంకి శంకర్ గారి ఆధ్వర్యంలోని కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల భద్రత, పాఠశాల అభివృద్ధి కోసం కమిటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

యువనేత గంట రవితేజ సొంత నిధులతో ఏర్పాటు – పేరెంట్స్ కమిటీ చైర్మన్ పెంకి శంకర్ ఆధ్వర్యంపై అభినందనలు

విశాఖపట్నం జిల్లా మధురవాడ( పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 16:: మధురవాడ సునీల్ శర్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు,కే. గీతాదేవి గారి అభ్యర్థన మేరకు, పాఠశాల విద్యార్థుల భద్రతతో పాటు అసాంఘిక కార్యక్రమాల నివారణ నిమిత్తం పాఠశాల పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పేరెంట్స్ కమిటీ చైర్మన్ పెంకి శంకర్, వైస్ చైర్మన్ R. లావణ్య గారు, ఇతర కమిటీ సభ్యులు మరియు తల్లిదండ్రులు ప్రత్యేకంగా కృషి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి తనయుడు, యువనేత గంట రవితేజ గారు తన సొంత నిధులతో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం పట్ల పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత, పాఠశాల ఆస్తుల పరిరక్షణ, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ప్రధానోపాధ్యాయురాలు కే. గీతాదేవి గారి అభ్యర్థనకు స్పందించి, తల్లిదండ్రుల కోరిక మేరకు చర్యలు చేపట్టి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన యువనేత గంట రవితేజ గారిని ప్రత్యేకంగా అభినందించారు.

అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చొరవ చూపిన పేరెంట్స్ కమిటీ చైర్మన్ పెంకి శంకర్ గారి ఆధ్వర్యంలోని కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల భద్రత, పాఠశాల అభివృద్ధి కోసం కమిటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.