నంద్యాల: అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి స్థలం, టిడ్కో ఇల్లు అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అధికారులను ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్లతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
పట్టణంలో ఖాళీగా ఉన్న టిడ్కో ఇళ్లను అర్హులకు పారదర్శకంగా కేటాయించాలని, ఆన్లైన్లో వచ్చిన దాదాపు 7 వేల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పట్టాలు మంజూరు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారులందరూ సమన్వయంతో పనిచేసి అర్హులకు న్యాయం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు: మంత్రి ఎన్ఎండీ ఫరూక్
నంద్యాల: అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి స్థలం, టిడ్కో ఇల్లు అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అధికారులను ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్లతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఖాళీగా ఉన్న టిడ్కో ఇళ్లను అర్హులకు పారదర్శకంగా కేటాయించాలని, ఆన్లైన్లో వచ్చిన దాదాపు 7 వేల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పట్టాలు మంజూరు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారులందరూ సమన్వయంతో పనిచేసి అర్హులకు న్యాయం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

