Wednesday, 16 September 2026
  • Home  
  • నైపుణ్య లక్ష్యాలు వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
- నంద్యాల

నైపుణ్య లక్ష్యాలు వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

నంద్యాల: జిల్లాలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో వృత్తి నైపుణ్యం, ఉపాధి శిక్షణ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన నైపుణ్య శిక్షణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, యువతకు శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. ధోన్ పారిశ్రామిక శిక్షణ సంస్థకు అనుసంధానించేందుకు అర్హతగల పరిశ్రమలను గుర్తించాలని సూచించారు. ఉద్యోగ మేళాలు, నిర్మాణ కార్మికుల శిక్షణ కోర్సుల లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు, జిల్లాలోని విద్యార్థులందరి వివరాలను నైపుణ్య పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు

నంద్యాల: జిల్లాలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో వృత్తి నైపుణ్యం, ఉపాధి శిక్షణ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ప్రభుత్వం నిర్దేశించిన నైపుణ్య శిక్షణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, యువతకు శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. ధోన్ పారిశ్రామిక శిక్షణ సంస్థకు అనుసంధానించేందుకు అర్హతగల పరిశ్రమలను గుర్తించాలని సూచించారు. ఉద్యోగ మేళాలు, నిర్మాణ కార్మికుల శిక్షణ కోర్సుల లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు, జిల్లాలోని విద్యార్థులందరి వివరాలను నైపుణ్య పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.