డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన
అమలాపురం పట్టణంలో మొబైల్ ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్రలో భాగంగా ఎర్ర వంతెన, అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి, రాయల్ జూనియర్ కళాశాల, హై స్కూల్ సెంటర్ మరియు విద్యార్థులకు, ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్ట మరియు జిల్లా ఎయిడ్స్ నివారణమండలి సహాకారంతో జనకళ్యాణ్ వెల్ఫేర్ సోసైటీ వారి ఆధ్వర్యంలో మొబైల్ సమగ్ర సంచార చైతన్య రధం తో విద్యార్థులకు సామాన్య ప్రజానీకానికి హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్, మత్తు మందుల వినియోగం వళ్ళ కలిగే అనర్థాలు మరియు యువత సామాన్య ప్రజానీకం వారియొక్క హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ స్థితిని తెలుసుకోవలసిన ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర ద్వారా ప్రజలకు మరియు యువత కు ఆరోగ్య విషయాలు హెచ్ ఐ వి ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యలు పై అవగాహన నివారణ చర్యలు గురించి తెలియజేయడం కోసం ఏర్పాటు చేయడమైందని అమలాపురం జనకళ్యాణ్ ప్రాజెక్ట్స్ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజర్ జి. శ్రీను తెలిపారు.ఈ కార్యక్రమంలో రిస్క్ అసెమెంట్ కు సంబందించిన ప్రశ్నాపత్రం క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా చేయాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గుత్తుల విజయ్ కుమార్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. విజయకుమారి, ఎస్ కే అలీ సమక్షంలో జనకళ్యాణ్ వెల్ఫేర్ సోసైటీ ప్రాజెక్ట్ సిబ్బంది ఎం జ్యోతి , పీఠం ఎడ్యుకేటర్ ఎం శ్యామల మరియు అధిక సంఖ్యలో ప్రజానీకం, విద్యార్థుల వీక్షించి విజ్ఞానాన్ని పొందారు.

అమలాపురంలో సురక్ష చైతన్య యాత్రలో భాగంగా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలో మొబైల్ ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్రలో భాగంగా ఎర్ర వంతెన, అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి, రాయల్ జూనియర్ కళాశాల, హై స్కూల్ సెంటర్ మరియు విద్యార్థులకు, ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్ట మరియు జిల్లా ఎయిడ్స్ నివారణమండలి సహాకారంతో జనకళ్యాణ్ వెల్ఫేర్ సోసైటీ వారి ఆధ్వర్యంలో మొబైల్ సమగ్ర సంచార చైతన్య రధం తో విద్యార్థులకు సామాన్య ప్రజానీకానికి హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్, మత్తు మందుల వినియోగం వళ్ళ కలిగే అనర్థాలు మరియు యువత సామాన్య ప్రజానీకం వారియొక్క హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ స్థితిని తెలుసుకోవలసిన ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర ద్వారా ప్రజలకు మరియు యువత కు ఆరోగ్య విషయాలు హెచ్ ఐ వి ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యలు పై అవగాహన నివారణ చర్యలు గురించి తెలియజేయడం కోసం ఏర్పాటు చేయడమైందని అమలాపురం జనకళ్యాణ్ ప్రాజెక్ట్స్ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజర్ జి. శ్రీను తెలిపారు.ఈ కార్యక్రమంలో రిస్క్ అసెమెంట్ కు సంబందించిన ప్రశ్నాపత్రం క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా చేయాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గుత్తుల విజయ్ కుమార్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. విజయకుమారి, ఎస్ కే అలీ సమక్షంలో జనకళ్యాణ్ వెల్ఫేర్ సోసైటీ ప్రాజెక్ట్ సిబ్బంది ఎం జ్యోతి , పీఠం ఎడ్యుకేటర్ ఎం శ్యామల మరియు అధిక సంఖ్యలో ప్రజానీకం, విద్యార్థుల వీక్షించి విజ్ఞానాన్ని పొందారు.

