ముథోల్, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి ):అఖిల భారతీయ స్థాయి ఘోష్ సమ్మేళనానికి సన్నాహాలు కొనసాగుతున్నాయని శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత ఘోష్ ప్రముఖ్ తంగెలపల్లి రమేష్ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ముథోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఘోష్ గణాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఘోష్ గణ నియమ నిబంధనలను వివరించారు. ఘోష్ గణానికి అవసరమైన దుస్తులు, వాయిద్య పరికరాలను సమకూర్చుకోవాలని పాఠశాల ప్రబంధకారిణికి సూచించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న అఖిల భారతీయ స్థాయి ఘోష్ సమ్మేళనానికి తెలంగాణ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో ఘోష్ గణాలను ఏర్పాటు చేసి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఘోష్ గణంలో భాగంగా ఆనక్, వంశీ, శంఖ తదితర వాయిద్యాలను వాయించడంలో విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమిష్టి భావనను పెంపొందించేందుకు ఘోష్ గణ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ కలిమహంతి వేణుమాధవ్, జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, పాఠశాల అధ్యక్షులు కొండావార్ సంజీవ్, సభ్యులు కంది దత్తాత్రి, ప్రధానాచార్యులు సారథి రాజు, తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారతీయ ఘోష్ సమ్మేళనానికి సన్నాహాలు