జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘనపూర్ మండలం జూన్ 30 పున్నమి న్యూస్ (గాంధీనగర్–ఘనపూర్ క్రాస్ రోడ్డు): డా. బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ట్రాక్టర్‌తో కూల్చివేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటన భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత మండలంలో జరగడం అత్యంత బాధాకరమని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ఫ్లెక్సీని ధ్వంసం చేయడం మాత్రమే కాకుండా, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి గౌరవాన్ని అవమానపరిచే చర్యగా ప్రజలు భావిస్తున్నారు.
ఈ ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులను గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు మరియు స్థానిక ప్రజలు పోలీసు, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.



