Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటిన సంకు కృపారావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటిన సంకు కృపారావు

అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటిన సంకు కృపారావు.

కామన్వెల్త్ పవర్లిఫ్టింగ్ స్వర్ణ పతక విజేతకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి అభినందనలు.

యువ క్రీడాకారులకు కృపారావు విజయం స్ఫూర్తిదాయకం.

క్రీడాకారుడికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తాం.

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, అక్టోబర్ 9:

కామన్వెల్త్ గేమ్స్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటిచెప్పిన జి.కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన సంకు కృపారావును మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అభినందించారు. శుక్రవారం జి.కొండూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ (P.G.R.S.) కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను స్వర్ణ పతక విజేత కృపారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సాధించిన విజయాన్ని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు ప్రత్యేకంగా ప్రశంసించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కెనడాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో కృపారావు స్వర్ణ పతకం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. కఠోర శ్రమ, నిరంతర సాధన, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడం అభినందనీయమని అన్నారు. కృపారావు విజయం రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని, సరైన ప్రోత్సాహం, అవకాశాలు లభిస్తే మన క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించగలరని పేర్కొన్నారు.

క్రీడాకారుడికి ఆర్థికంగా అండగా పి-4

కృపారావులోని క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పి-4 కార్యక్రమం ద్వారా ఆర్థికసాయం అందించింది. ఈ మేరకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ గారికి లేఖ రాయగా, కృపారావుకు రూ.1 లక్ష ఆర్థికసాయం అందినట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడం, వారి విజయ ప్రస్థానానికి అవసరమైన సహకారం అందించడం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

కృపారావు సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం అందించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు హామీ ఇచ్చారు. క్రీడాకారులు తమ లక్ష్యాల సాధనలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

మరిన్ని పతకాలు సాధిస్తా.. కృపారావు

తన విజయాన్ని గుర్తించి అభినందించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి సంకు కృపారావు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరింత కష్టపడి సాధన చేస్తూ రాష్ట్రానికి, దేశానికి మరిన్ని పతకాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని, ప్రతిభావంతులైన క్రీడాకారులకు అండగా నిలవడం సమాజ బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు

అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటిన సంకు కృపారావు

అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటిన సంకు కృపారావు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *