Tuesday, 8 September 2026
  • Home  
  • అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం చిన్నారుల భవిష్యత్తుకు పునాది
- తూర్పు గోదావరి

అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం చిన్నారుల భవిష్యత్తుకు పునాది

*జగ్గంపేటలో అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి శిక్షణలో నూతన ఉత్సాహం – చిన్నారుల భవిష్యత్తుకు పునాది… ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ* కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 22:జగ్గంపేట పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంగన్వాడీ కార్యకర్తల కోసం నిర్వహిస్తున్న జ్ఞాన జ్యోతి రెండు, మూడు విడత శిక్షణ కార్యక్రమం మూడవ దశ ఆగస్టు22, ఆగస్టు 24, నుండి ఆగస్టు 25 వరకు కొనసాగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ సందర్శించి శిక్షణలో పాల్గొంటున్న అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడారు. శిక్షణలో అందిస్తున్న అంశాలు, బోధనా పద్ధతులు, కార్యకర్తల అవగాహన తదితర అంశాలను పరిశీలించారు.ప్రారంభ బాల్య సంరక్షణ, విద్యలో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని, శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సమర్థవంతంగా అమలు చేసి చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం అధికారి పూర్ణిమ మాట్లాడుతూ జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాలకు చెందిన నూట అరవై ఆరు మంది అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.జ్ఞాన జ్యోతి శిక్షణ ద్వారా అంగన్వాడీ కార్యకర్తల్లో నైపుణ్యాలను పెంపొందించి చిన్నారులకు నాణ్యమైన పూర్వ పాఠశాల విద్య అందించడమే ప్రధాన లక్ష్యం. ఈ శిక్షణలో జిల్లా వనరుల వ్యక్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, పర్యవేక్షకురాలు అమ్మాజీ, అంగన్వాడీ కార్యకర్తలు మరియు సంబంధిత మండల విద్యాశాఖాధికారి ఒకటి స్వామి, మండల విద్యాశాఖాధికారి రెండు సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయులు పాండురంగారావు పాల్గొన్నారు.

*జగ్గంపేటలో అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి శిక్షణలో నూతన ఉత్సాహం – చిన్నారుల భవిష్యత్తుకు పునాది… ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ*

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 22:జగ్గంపేట పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంగన్వాడీ కార్యకర్తల కోసం నిర్వహిస్తున్న జ్ఞాన జ్యోతి రెండు, మూడు విడత శిక్షణ కార్యక్రమం మూడవ దశ ఆగస్టు22, ఆగస్టు 24, నుండి ఆగస్టు 25 వరకు కొనసాగుతోంది.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ సందర్శించి శిక్షణలో పాల్గొంటున్న అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడారు. శిక్షణలో అందిస్తున్న అంశాలు, బోధనా పద్ధతులు, కార్యకర్తల అవగాహన తదితర అంశాలను పరిశీలించారు.ప్రారంభ బాల్య సంరక్షణ, విద్యలో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని, శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సమర్థవంతంగా అమలు చేసి చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం అధికారి పూర్ణిమ మాట్లాడుతూ జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాలకు చెందిన నూట అరవై ఆరు మంది అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.జ్ఞాన జ్యోతి శిక్షణ ద్వారా అంగన్వాడీ కార్యకర్తల్లో నైపుణ్యాలను పెంపొందించి చిన్నారులకు నాణ్యమైన పూర్వ పాఠశాల విద్య అందించడమే ప్రధాన లక్ష్యం.
ఈ శిక్షణలో జిల్లా వనరుల వ్యక్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, పర్యవేక్షకురాలు అమ్మాజీ, అంగన్వాడీ కార్యకర్తలు మరియు సంబంధిత మండల విద్యాశాఖాధికారి ఒకటి స్వామి, మండల విద్యాశాఖాధికారి రెండు సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయులు పాండురంగారావు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.