మండల కేంద్రమైన వాకాడులోని గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలోని 15 మంది చిన్నారులకు వారికి అవసరమైన విద్యాసామాగ్రిని కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎం.వి.రావు ఫౌండేషన్ విద్యా సామాగ్రిని చేయూత క్రింద పంపిణీ చేశారు.
వాకాడు తాలూకా ఖజానా అధికారి రవీంద్రనాథ్ చేతుల మీదుగా విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు.
ఎంవి రావు ఫౌండేషన్ గత 19 సంవత్సరాలుగా అనునిత్యం స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఈ క్రమంలో వాకాడు గిరిజన కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో విద్యనభ్యసించే చిన్నారులకు చేయూత కింద వారికి అవసరమైన పలక బలపం చాపలను అంగన్వాడీ కేంద్రం టీచర్ ఆధ్వర్యంలో ఉప ఖజానా అధికారి రవీంద్రనాథ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ మా ఫౌండేషన్ నేటికీ 11703 సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువైoదఅన్నారు
ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్ఓ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి ఉపగజానాధికారి రవీంద్రనాథ్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.



