ఓబులవారిపల్లి: మండలంలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో పల్లె పండుగ–3.0లో భాగంగా రెండు చోట్ల పశువుల షెడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. వి.బి.జి. రామ్జీ నిధులతో చేపట్టనున్న ఈ పనులను రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశుపోషకులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు పల్లె పండుగ–3.0 ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పశువులకు మెరుగైన వసతులు కల్పించడం వల్ల పశుపోషకులకు ప్రయోజనం చేకూరడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పశుపోషణకు ఊతమిచ్చేలా పల్లె పండుగ–3.0