అంబేద్కర్ కోనసీమ జిల్లా: వర్షం కారణంగా ఉప్పలగుప్తం సెక్షన్ పరిధిలోని సరిపల్లి మెయిన్ రోడ్డులో 11 కేవీ చల్లపల్లి, గోపవరం ఫీడర్ లైన్లపై చెట్లు పడిపోయాయి.
సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని విద్యుత్ లైన్లపై పడిన చెట్లను తొలగించే పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.


