Tuesday, 22 September 2026
  • Home  
  • చెత్తాచెదారంతో అష్టకష్టాలు.. బాధితురాలి కన్నీటి గోడు
- ASIFABAD

చెత్తాచెదారంతో అష్టకష్టాలు.. బాధితురాలి కన్నీటి గోడు

ఇంటి పరిసరాల్లో చెత్త వేస్తున్నారని ఆరోపణ.. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం లేదని ఆవేదన వాంకిడి, సెప్టెంబర్ 21 (పున్నమి): వాంకిడి గ్రామపంచాయతీ పరిధిలోని ఒకటో వార్డులో పారిశుద్ధ్య సమస్యతో ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించింది. రాంటెంకి రశిక, భర్త భీంరావు తమ ఇంటి ఆవరణ సమీపంలో చెత్తాచెదారం వేయడం వల్ల దుర్వాసన, అపరిశుభ్రతతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం లేదని ఆవేదన తమ సమస్యను వార్డు సభ్యుడు, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత సిబ్బంది దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని రశిక తెలిపారు. వర్షాలు కురిసిన సమయంలో చెత్త పేరుకుపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని పేర్కొన్నారు. చెత్తాచెదారం కారణంగా దుర్వాసన వస్తోందని, కుటుంబ సభ్యులు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి ఏర్పడిందని ఆమె వాపోయారు. ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను తొలగించి, భవిష్యత్తులో తమ ఇంటి పరిసరాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మీడియా ఎదుట కన్నీటి పర్యంతం తన సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతో చివరకు మీడియాను ఆశ్రయించాల్సి వచ్చిందని రశిక తెలిపారు. మీడియా ఎదుట తన గోడును వివరిస్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. “మా సమస్యను ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం కాలేదు. ఇకనైనా అధికారులు స్పందించి మా ఇంటి పరిసరాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలి. మేము కూడా మనుషులమే.. ప్రశాంతంగా జీవించే పరిస్థితి కల్పించాలి” అంటూ రశిక వేడుకున్నారు. అధికారుల స్పందన కోసం ఎదురుచూపు ఈ ఘటనపై గ్రామపంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవ పరిస్థితులను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. చెత్తను తొలగించడంతో పాటు మళ్లీ అదే ప్రాంతంలో చెత్త పేరుకుపోకుండా శాశ్వత పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి ఆరోపణలపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఇంటి పరిసరాల్లో చెత్త వేస్తున్నారని ఆరోపణ.. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం లేదని ఆవేదన

వాంకిడి, సెప్టెంబర్ 21 (పున్నమి):
వాంకిడి గ్రామపంచాయతీ పరిధిలోని ఒకటో వార్డులో పారిశుద్ధ్య సమస్యతో ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించింది. రాంటెంకి రశిక, భర్త భీంరావు తమ ఇంటి ఆవరణ సమీపంలో చెత్తాచెదారం వేయడం వల్ల దుర్వాసన, అపరిశుభ్రతతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం లేదని ఆవేదన

తమ సమస్యను వార్డు సభ్యుడు, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత సిబ్బంది దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని రశిక తెలిపారు. వర్షాలు కురిసిన సమయంలో చెత్త పేరుకుపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని పేర్కొన్నారు.

చెత్తాచెదారం కారణంగా దుర్వాసన వస్తోందని, కుటుంబ సభ్యులు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి ఏర్పడిందని ఆమె వాపోయారు. ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను తొలగించి, భవిష్యత్తులో తమ ఇంటి పరిసరాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

మీడియా ఎదుట కన్నీటి పర్యంతం

తన సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతో చివరకు మీడియాను ఆశ్రయించాల్సి వచ్చిందని రశిక తెలిపారు. మీడియా ఎదుట తన గోడును వివరిస్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

“మా సమస్యను ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం కాలేదు. ఇకనైనా అధికారులు స్పందించి మా ఇంటి పరిసరాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలి. మేము కూడా మనుషులమే.. ప్రశాంతంగా జీవించే పరిస్థితి కల్పించాలి” అంటూ రశిక వేడుకున్నారు.

అధికారుల స్పందన కోసం ఎదురుచూపు

ఈ ఘటనపై గ్రామపంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవ పరిస్థితులను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. చెత్తను తొలగించడంతో పాటు మళ్లీ అదే ప్రాంతంలో చెత్త పేరుకుపోకుండా శాశ్వత పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి ఆరోపణలపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.