స్టేషన్ ఘనపూర్: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతల వలసలు
స్టేషన్ ఘనపూర్ మండలం అక్కపల్లిగూడెంకు చెందిన 20 మంది బీఆర్ఎస్ నాయకులు వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హన్మకొండ నివాసంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ప్రజలను కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తున్నాయని ఎంపీ తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

