జనగాం
సముద్రాలలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. చీకటిమయం!
జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు అలుముకోవడంతో పగలే చీకటిమయమైంది. ఉదయం వేళ అకస్మాత్తుగా ఏర్పడిన ఈ వాతావరణ మార్పుతో స్థానికులు, రైతులు అప్రమత్తమయ్యారు. పచ్చని పంట పొలాలపై కమ్ముకున్న ఈ మేఘాలు భారీ వర్షం కురిసే సూచనలా కనిపిస్తున్నాయి.


