సముద్రాలలో వినాయక మండపాన్ని సందర్శించిన సీఐ శ్రీనివాస్.. ఉత్సవ కమిటీకి భద్రతా సూచనలు
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలోని హనుమాన్ టెంపుల్ లో ప్రతిష్టించిన వినాయక విగ్రహాన్ని స్టేషన్ ఘన్పూర్ సీఐ శ్రీనివాస్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బత్తుల యాగిరి, ఈగ రాకేశ్, ఐతా రాకేశ్, సూత్రపు వెంకటేశు, సూత్రపు నాగరాజు, కట్లా హరిష్, ఎల్లబోయిన విష్ణు, ఎల్లబోయిన అనిల్, కత్తుల అరుణ్,కట్ల రాజు, గ్రామ ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


