Tuesday, 2 June 2026

Tag: క్రీడలు

News ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం

ఎలైట్ క్రికెట్ లీగ్ (ఈసీఎల్) సీజన్-2″ ట్రోఫీ ఆవిష్కరణ

రాష్ట్ర రవాణా క్రీడ యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నం, విశాఖ వేదికగా చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ‘ECL సీజన్ 2’ క్రికెట్ టోర్నమెంట్ త్వరలో జరగనుందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండేపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. విశాఖలోని ఒక హోటల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి పాల్గొని, ఈ టోర్నమెంట్ ట్రోఫీని ఘనంగా ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో ప్రజలను కాపాడే సైనికుల సహాయార్థం ఈ నెల 27, 28 తేదీలలో పీఎం పాలెం ADCA, VDCA స్టేడియంలో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఒక గొప్ప ఆశయంతో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌ను విజయవంతం చేసేందుకు ప్రజలు, వాణిజ్య సంస్థలు భాగస్వాములు కావాలని, వచ్చే 25 రోజుల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో క్రికెట్ అనేది ఒక ఎమోషన్ అని, అందుకే ఈ సేవా కార్యక్రమానికి దీనిని వేదికగా ఎంచుకున్నరని తెలిపారు. ​మొత్తం 6 టీమ్‌లు తలపడే ఈ రెండు రోజుల టోర్నమెంట్‌లో సుమారు 35 నుండి 40 మంది ఎమ్మెల్యేలు, 15 మంది రాష్ట్ర మంత్రులతో పాటు సినీ, టీవీ ఆర్టిస్టులు, ప్రముఖ డాక్టర్లు క్రీడాకారులుగా పాల్గొంటారని చెప్పారు. టోర్నమెంట్ స్పాన్సర్‌షిప్ కోసం వ్యాపారవేత్త మారుతి 10 లక్షల ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్న మంత్రి.. ఈ ఈవెంట్ ద్వారా సేకరించే కోటికి పైగా నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ECL చైర్మన్ చామల ఉదయ్ చందర్ రెడ్డి, నటుడు & ECL డైరెక్టర్ రవీందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సామ రాజేందర్ రెడ్డి, ప్రముఖ నటుడు ప్రభాకర్, పున్రెడ్డి శివారెడ్డి, చారుణ్య తదితరులు పాల్గొన్నారు.

News ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం

ఆత్మరక్షణే లక్ష్యం.. కిక్ బాక్సింగ్ క్యాంప్‌లో విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన ఈతలపాక సుజాత

ఉత్తరాంధ్ర ప్రతినిధి మే 31 యువతరం న్యూస్ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలను అలవర్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉచిత కిక్ బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఈతలపాక సుజాత సందర్శించి విద్యార్థులను ప్రోత్సహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 56వ వార్డు పరిధిలో గల కంచరపాలెం ఆర్‌పీవేట ఉన్నత పాఠశాలలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు, జోనల్ కమిషనర్ హైమావతి పర్యవేక్షణలో అల్ ఇండియా ఎన్షియంట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మరియు టైగర్ కిక్ బాక్సింగ్ కౌన్సిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ మాస్టర్ గుండి జానకి రామ్ నేతృత్వంలో ఉచిత కిక్ బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్యాంప్‌ను సందర్శించిన ఈతలపాక సుజాత, కిక్ బాక్సింగ్ శిక్షణ పొందుతున్న చిన్నారులకు తన సొంత నిధులతో పాలు ప్యాకెట్లు, చాక్లెట్ క్రీమ్ కేకులు, ఉడికించిన కోడిగుడ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. విద్యార్థులతో మమేకమై వారి అభ్యాసాన్ని పరిశీలించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లలు కిక్ బాక్సింగ్, కరాటే వంటి ఆత్మరక్షణ క్రీడలను తప్పనిసరిగా నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబర్చి తమ కుటుంబానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 56వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ కార్తీక్ యాదవ్, బి. శ్రీకాంత్, కె. కోటేశ్వరరావు, కోచ్ గుండి జానకి రామ్, అసిస్టెంట్ కోచ్ బి. భరత్ తదితరులు పాల్గొన్నారు. “క్రీడలతో శక్తి.. ఆత్మరక్షణతో భద్రత.. విద్యార్థుల అభివృద్ధికి సుజాత చేయూత” అంటూ కార్యక్రమం ప్రశంసలు అందుకుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.