ముస్తాబాద్ లో మండల స్థాయిలో సంక్షేమ సమీక్ష
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి సంక్షేమ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల పనితీరు, గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు సక్రమంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసిల్దార్ అపర్ణ, ఎంపీడీవో లచ్చాలు, ఆత్మ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, చైస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి, వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.


