ఎస్ ఆర్ డి జి పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ సంబరాలు
స్థానిక ఎస్‌ఆర్‌డీజీ పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రిన్సిపల్ గడ్డం కృష్ణ చైతన్య మాట్లాడుతూ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. సోదరుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుతూ ప్రేమతో కట్టే రాఖీ రక్షణ, అనుబంధానికి సంకేతమని వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండుగ విశిష్టతను తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


