Wednesday, 19 August 2026

Tag: Roads

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు ఉంది… ప్రయాణానికి పనికొస్తుందా?

గుంతలు, అసమాన రోడ్లు, రోడ్డు తవ్వకాల తర్వాత సరైన పునరుద్ధరణ లేకపోవడం ప్రయాణాన్ని కష్టతరం చేస్తుంది. నగరంలోని ప్రతి ప్రధాన, అంతర్గత రహదారికి రహదారి స్థితిగతుల తనిఖీ నిర్వహించాలి. గుంతలు, దెబ్బతిన్న ప్రాంతాలు, నీరు నిలిచే పాయింట్లను GPS ఆధారంగా నమోదు చేసి ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేయాలి. పైప్‌లైన్ లేదా కేబుల్ పనుల కోసం రోడ్డు తవ్విన సంస్థే నిర్ణీత సమయంలో రోడ్డును పునరుద్ధరించేలా బాధ్యత విధించాలి. నాసిరకం పనులపై కాంట్రాక్టర్లకు జరిమానాలు ఉండాలి.

మేడ్చల్ – మల్కాజిగిరి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 279వ డివిజన్ శ్రీరామ్ నగర్ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కొలన్ హన్మంత్ రెడ్డి

శ్రీరామ్ నగర్–బి రోడ్డు, మేస్త్రీ నగర్ ప్రాంతాల్లో 8, 9, 10, 11, 12వ వీధుల్లో రోడ్ల దుస్థితి కారణంగా ప్రజల రాకపోకలకు, చిన్నారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని స్థానికులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యపై వెంటనే స్పందించిన ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సహకారంతో, CMC నిధుల ద్వారా రూ.60 లక్షల వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి సమక్షంలో, వారి చేతుల మీదుగా ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవ్ రెడ్డి, డీసీసీ సెక్రటరీ లాయక్, అజయ్, జమీర్ రహీమ్, కలీమ్, గఫార్, ఖాజా రెహ్మాన్ ఖహీల్, ఎం.డి. ఖలీల్ ఉర్ రెహ్మాన్, హనీఫ్, నవీన్ గౌడ్, యాదగిరి, బుచ్చి రెడ్డి, అంజనేయులు, నరసింహాచారి, విశ్వనాథ్, ప్రభాకర్, అజాజ్, శ్రావణ్, విష్ణువర్ధన్ గౌడ్, కృష్ణ గౌడ్, ప్రభు గౌడ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.