Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Rayatu

నంద్యాల

గ్రామీణ శ్రామికులకు ఉపాధి పనికి కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలి. వ్యవసాయ కార్మిక సంఘం.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ నాయక్ డిమాండ్ చేశారు, అఖిలభారత పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్ అధ్యక్షతన నంద్యాల గాంధీ చౌక్ లో నిరసన తెలుపుతూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎం నరసింహ నాయక్ మాట్లాడుతూ ఎల్ నివో ప్రభావం వలన జిల్లా వ్యాప్తంగా కరువు కాటకాలతో గ్రామీణ ఉపాధి కూలీలకు ఉపాధి అవకాశాలు లేక, ధరలు విపరీతంగా పెరిగిన సందర్భంగా కొనితినే స్థితిలో లేరు కావున ప్రభుత్వం ప్రతి జాబ్ కార్డు కుటుంబానికి 200 పని దినాలు , ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి రోజువారి కూలీ 600, ఇవ్వాలి, కూలీలు అడిగిన పనులు కల్పించాలి, వారం వారం ప్లే స్లిప్పులు ఇవ్వాలి, వారం వారం బిల్లులు ఇవ్వాలి, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, భూమి గట్టిగా ఉన్నది కాబట్టే కూలీలకు సమ్మర్ అలవెన్స్ 40% ఇవ్వాలి, జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పౌరసరఫరా ల శాఖ ద్వారా పది రకాల నిత్యవసర సరుకులు ఉచితంగా ఇవ్వాలి, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి, కరువు మండలాలు ప్రకటించిన అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలి, పనులు కల్పించ లేకపోతే కూలీలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, తక్షణమే జిల్లా అధికారులు కరువు మండలాల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూలీలను ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో జిల్లాలో కూలీలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమ చేస్తామని వారన్నారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కుళాయి స్వామి, కృష్ణ, జయన్న, బండి రత్నమయ్య, సీనియర్ నాయకులు రామచంద్రుడు, రాజేశ్వరి,సిఐటియు నాయకులు రాజు, సుబ్బరామయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కన్వీనర్ బాల ఉషన్, తదితరులు పాల్గొన్నారు