Monday, 21 September 2026

Tag: Rakhi Celebrations

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎస్ ఆర్ డి జి పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ సంబరాలు

స్థానిక ఎస్‌ఆర్‌డీజీ పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రిన్సిపల్ గడ్డం కృష్ణ చైతన్య మాట్లాడుతూ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. సోదరుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుతూ ప్రేమతో కట్టే రాఖీ రక్షణ, అనుబంధానికి సంకేతమని వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండుగ విశిష్టతను తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.