విద్యార్థులే హంతకులు
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె వద్ద చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి, కత్తితో 27 సార్లు పొడిచి హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ.2 లక్షలు తీసుకొని హైదరాబాద్‌లో జల్సాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు బాల నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


