రావుల ప్రవీణ్‌కు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా శుభాకాంక్షలు
-జన్మదిన వేడుకల్లో ఆత్మీయంగా పలకరించి ఆశీర్వదించిన రాష్ట్ర డీజీపీ -ప్రవీణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన స్నేహితుడు చెన్నుపాటి రవికుమార్ చౌదరి పామూరు, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి ): రావుల ప్రవీణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ను ఆత్మీయంగా పలకరించి ఆశీర్వదించిన డీజీపీ, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. జన్మదినం సందర్భంగా ప్రవీణ్‌ను అభినందించిన హరీష్‌కుమార్ గుప్తా, ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. డీజీపీ స్వయంగా శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించడంతో ప్రవీణ్ ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ స్నేహితుడు చెన్నుపాటి రవికుమార్ చౌదరి కూడా పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

