Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #Nellore #NelloreMunicipalCorporation #YONandan #TownPlanning #LayoutApprovals #BuildingPermits #GomathiNagar #PunnamiNews

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనుమతుల మేరకే నిర్మాణాలు చేపట్టాలి

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ శనివారం నాలుగో మైలు నవలాకుల తోటలో నిర్మిస్తున్న లేఅవుట్‌ను సిటీ ప్లానర్ రఘునాథరావుతో కలిసి పరిశీలించారు. లేఅవుట్‌కు సంబంధించిన అనుమతులు, ప్లాన్‌, ఇతర పత్రాలను తనిఖీ చేసి నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. అనుమతించిన మేరకే లేఅవుట్ అభివృద్ధి పనులు జరిగేలా పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం హరనాథపురం ఎక్స్‌టెన్షన్‌లోని గోమతినగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనాన్ని సందర్శించి నిర్మాణ ప్లాన్‌ను పరిశీలించారు. పట్టణ ప్రణాళికా విభాగం ఆమోదించిన ప్లాన్‌కు అనుగుణంగా భవన నిర్మాణ పనులు చేపట్టాలని యజమానులకు సూచించారు. ఈ పరిశీలనలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన టీపీబీఓలు, వార్డు సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.