Tuesday, 15 September 2026

Tag: MunicipalCommissioner

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పన్ను వసూళ్ల లక్ష్యాల సాధనపై కమిషనర్ సమీక్ష

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ మంగళవారం రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. 2026-27 తొలి అర్థ సంవత్సరం ముగింపుకు 36 రోజులే మిగిలి ఉన్నందున నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. కొత్త భవనాలు, ఖాళీ స్థలాలు, అదనపు అంతస్తులను గుర్తించి పన్ను పరిధిలోకి తేవాలని సూచించారు. లోక్ అదాలత్ నోటీసుల అనంతరం కూడా బకాయిలు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాలని, పౌర సేవల దరఖాస్తులను గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు ప్రతిరోజూ బకాయి వసూళ్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టీపీఆర్ఓ వాసుబాబు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం : సృజన

సైబరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. 70 గజాల స్థలంలో 7 మీటర్లకు మించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని స్పష్టం చేశారు. ఇతర విధులు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాల గుర్తింపును నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఫిర్యాదులపై స్పందించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ డబ్బులు తీసుకున్నట్లు తేలితే సస్పెన్షన్‌కు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: కమిషనర్ వై.ఓ నందన్

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారులతో కలిసి బుధవారం స్థానిక మినీ బైపాస్ అన్నమయ్య కూడలి సమీపంలోని జాకీ షోరూం పరిసర ప్రాంతాలలో పర్యటించారు. సమస్యలు పునరావృతం కాకుండా వాటికి శాశ్వతంగా పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం సమీపంలోని వెంగన్న కాలువను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సర్వేయర్ కామేశ్వరరావు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.