ఈ నెల 21, 22 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం పర్యటన.
ఈ నెల 21, 22 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పార్టీ శ్రేణుల సమన్వయం చర్చించేందుకు కాకినాడలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయని తెలిపారు. 22న పిఠాపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా సమన్వయంతో పనిచేయాలని ఎంపీ గారు పిలుపునిచ్చారు. పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు గారు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు, కౌడా చైర్మన్ తలాటం సత్య గారు, గోదావరి ఇస్ట్రన్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ గారు, జనసేన పార్టీ మహిళా నాయకురాలు డా.బుర్రా దివ్యరాజ్ గారు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంపీ వారి క్యాంపు కార్యాలయం, కాకినాడ


