Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: celebration

ASIFABAD

రెబ్బెన మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

రెబ్బెన మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేసరి కిషన్ గౌడ్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశానికి సత్యం, అహింస, శాంతి మార్గాలను చూపిన మహనీయుడని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ పేరుతో కొనసాగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీజీ పేరును తొలగించడమే కాకుండా గ్రామీణ పేదల ఉపాధి హక్కును బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పల్లె ప్రకాష్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెన్న సోమశేఖర్, మోడెమ్ చిరంజీవి గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు రత్నం ఆనంద్ రావు, వార్డు సభ్యులు అజ్మీరా ఈశ్వర్, రవి నాయక్, మండల కార్యదర్శి సాంబా గౌడ్, మండల ఉపాధ్యక్షులు బలరాం నాయక్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు జహురోద్దీన్, లింగంపల్లి ప్రభాకర్, మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంకరమ్మ, ఓఓమిత్ మండల్, శివ ప్రసాద్ పాల్గొన్నారు.