మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్రలో చమత్కార వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా అనుకరిస్తూ, “హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నాం.. ఏ సంవత్సరం వంద రోజులో చెప్పలేదు కదా!” అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, రైతుల సమస్యలు, ఢిల్లీ నాయకత్వంతో ఇబ్బందులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.


