Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Breking

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శెట్టిపాలెం పంచాయతీ, తూర్పు జంగాలపల్లి గ్రామంలో పెన్షన్లు

శెట్టిపాలెం పంచాయతీ, తూర్పు జంగాలపల్లి గ్రామంలో పెన్షన్లు పంపిణీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు పంపిణి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలను ప్రజలకు చేయాలనే లక్ష్యంతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఉదయగిరి శాసనసభ్యులు ఆదేశాలు మేరకు శ్రీ కాకర్ల సురేష్ అన్న గారి ఆదేశాలు మేరకు కొండాపురం మండలం , శెట్టిపాలెం పంచాయతీలో. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టమ్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల కార్యక్రమం లో పాల్గొన్న సచివాలయం సిబ్బంది.తడకలూరు హరీశ్ మరియు నాయకులు ఆధ్వర్యంలో ఉదయం 6.30 గంటలు పెన్షన్ పంపిణి చేయటం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు 5 సీలింగ్ ఫ్యాన్ల పంపిణీ.

వింజమూరు మండల కేంద్రంలోని గంగమిట్ట, బీసీ కాలనీ, అరుంధతివాడ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సతీమణి శ్రీమతి కాకర్ల ప్రవీణ గారు, మాజీ ఎంపీపీ శ్రీమతి వనిపెంట హైమావతి గారు, ఉదయగిరి నియోజకవర్గ మహిళ ప్రధాన కార్యదర్శి శ్రీమతి రేబాల రూపకల గారితో కలిసి 5 సీలింగ్ ఫ్యాన్లను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశారు.అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించేలా అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.ఈ సందర్భంగా గంగమిట్ట అంగన్వాడీ కేంద్రంలో గత 20 రోజులుగా విద్యుత్ సమస్య ఉందని సిబ్బంది మరియు స్థానికులు శ్రీమతి కాకర్ల ప్రవీణ గారి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను తెలుసుకున్న వెంటనే ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యుత్ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని, అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన వసతుల కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, విద్య, భద్రతకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, అంగన్వాడీ కేంద్రాలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, స్థానిక నాయకులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన వివరాలు

2:15 PM – రామాపురం హెలిప్యాడ్‌కు చేరిక (వరికుంటపాడు మండలం) 2:15 – 2:30 PM – ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం 2:35 PM – కాకొల్లువారిపల్లి గ్రామానికి చేరిక (వరికుంటపాడు మండలం) 2:35 – 3:00 PM – కొత్త బీటీ రోడ్డుపై పరిశీలన, ఉపాధి హామీ కూలీలతో కలిసి శ్రమదానం 3:05 PM – రామాపురం కార్యక్రమ వేదికకు చేరిక 3:05 – 5:20 PM – కార్యక్రమంలో పాల్గొనడం 5:25 PM – రామాపురం హెలిప్యాడ్‌కు చేరిక 5:30 PM – హెలికాప్టర్‌లో బయలుదేరి 6:30 PM – ఉండవల్లి నివాసానికి చేరిక.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అధికంగా పండించిన మరియు అనధికారిక పొగాకు విక్రయానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి

2025-26 పంట కాలానికి సంబంధించి పొగాకు బోర్డు నిర్దేశించిన పరిమితికి మించి పండించిన మరియు అనధికారికంగా ఉత్పత్తి చేసిన పొగాకును విక్రయించుకునేందుకు ఎటువంటి అపరాధ రుసుము విధించకుండా, ఈ ఒక్క పంట కాలానికి మాత్రమే భారత ప్రభుత్వం ప్రత్యేక అనుమతి మంజూరు చేసినట్లు కలిగిరి పొగాకు బోర్డు సూపరింటెండెంట్ జి. రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.పొగాకు బోర్డు నిర్దేశించిన పరిమితికి మించి పొగాకు పండించిన ప్రతి రైతు, అధికంగా ఉన్న పొగాకు పరిమాణానికి సంబంధించి పొగాకు బోర్డులో తప్పనిసరిగా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా, రైతుకు మంజూరైన అధీకృత పరిమాణంతో కలిపి 60 క్వింటాళ్ల వరకు ఆక్షన్ సూపరింటెండెంట్ స్థాయిలో అనుమతి మంజూరు చేయబడుతుందని తెలిపారు. 60 క్వింటాళ్లకు మించి 80 క్వింటాళ్ల వరకు రీజినల్ మేనేజర్ స్థాయిలో, అలాగే 80 క్వింటాళ్లకు మించి ఉత్పత్తి చేసినట్లయితే పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం, గుంటూరు నుండి అనుమతి పొందడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి

పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ జి.ఎల్.కె. ప్రసాద్ ఆధ్వర్యంలో పొగాకు రైతులకు పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ శ్రీ జి.ఎల్.కె. ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కలిగిరి పొగాకు బోర్డు ఆక్షన్ సూపరింటెండెంట్ శ్రీ జి. రాజశేఖర్, కేవీకే నెల్లూరు శాస్త్రవేత్త శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, వింజమూరు వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీ శేషగిరి రావు, పశుసంవర్ధక శాఖ అధికారి డా. ఎం. మధు, రీజినల్ మేనేజర్ కార్యాలయ వేలం నిర్వహణాధికారి శ్రీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ శ్రీ జి.ఎల్.కె. ప్రసాద్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది పొగాకు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఒక బ్యారన్‌కు 21 క్వింటాళ్ల ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులు అనుమతించిన పరిమాణానికి మించి పొగాకు సాగు చేయవద్దని సూచించారు. డిమాండ్‌కు మించి ఉత్పత్తి చేసిన పొగాకుకు తగిన ధర లభించే అవకాశం ఉండదని తెలిపారు.రైతులు పొగాకు బోర్డు అనుమతించిన పరిమితి మేరకు మాత్రమే పొగాకు సాగు చేసి, మిగిలిన భూమిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే బ్యారన్ కవులు, పొలం కవులను తగ్గించుకోవడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించి, పొగాకు సాగును మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చని తెలిపారు.వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీ శేషగిరి రావు మాట్లాడుతూ, ప్రస్తుతం అనేక మండలాల్లో పొగాకు సాగు అధికంగా ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు సాగు పెరగడంతో డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో రైతులు చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని సూచించారు. కేవీకే నెల్లూరు శాస్త్రవేత్త శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేల రకం, నీటి వసతి, వర్షపాతం, మార్కెట్ డిమాండ్, విత్తే సమయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. మిరప, కంది, పెసర, మినుము, ఉలవ, అలసంద, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, రాగి, జొన్న, మొక్కజొన్న, ధనియాలు తదితర పంటలను పొగాకుకు ప్రత్యామ్నాయంగా సాగు చేసుకోవచ్చని తెలిపారు.ప్రస్తుతం జొన్న సాగు అనుకూలంగా ఉందని, నవంబర్ మొదటి వారంలో జొన్న విత్తుకోవచ్చని సూచించారు. నంద్యాల తెల్లజొన్న–5 రకాన్ని సాగు చేస్తే ఎకరాకు సుమారు 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందే అవకాశం ఉందని వివరించారు. జొన్నకు ప్రస్తుతం క్వింటాలుకు రూ.4,023 మద్దతు ధర ఉందని తెలిపారు. జొన్న పంట బెట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకోగలదని, రైతులు తమ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.పశుసంవర్ధక శాఖకు చెందిన డా. ఎం. మధు, కొండాపురం మరియు దుత్తలూరు మండలాల పశుసంవర్ధక అధికారి మాట్లాడుతూ, పొగాకు సాగును తగ్గించి, ప్రత్యామ్నాయంగా పశుపోషణ ద్వారా ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఒక ఎకరా పొగాకు సాగుతో సమానమైన ఆదాయాన్ని పొందే విధంగా 2 ముర్రా జాతి గేదెలు, 2 జెర్సీ ఆవులు, 20 నెల్లూరు జాతి గొర్రెలు, 20 స్థానిక జాతి మేకలు లేదా 1,000 ఆశీల్/గిరిరాజ/వనరాజ జాతి కోళ్ల పెంపకం వంటి యూనిట్లను చేపట్టవచ్చని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాల ద్వారా పశుగ్రాస విత్తనాలను వినియోగించుకుని జొన్న, మొక్కజొన్న, అలసంద తదితర పశుగ్రాస పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు పచ్చి మేత కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే సబ్సిడీపై అందుబాటులో ఉన్న పశువుల దాణాను వినియోగించుకుని పాల దిగుబడి తగ్గకుండా చూసుకోవాలని సూచించారు.MGNREGS శాఖ సమన్వయంతో హరిత గోపాలం కార్యక్రమం కింద, అలాగే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) ద్వారా డైరీ, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటి యూనిట్లను వివిధ సబ్సిడీ పథకాల ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.గొర్రెలు, మేకలకు పశు భీమా సౌకర్యం కూడా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. రైతు వాటాగా ఒక్క గొర్రె/మేకకు రూ.27 ప్రీమియం చెల్లిస్తే, ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో సంబంధిత నిబంధనల ప్రకారం ఒక్క జీవానికి రూ.6,000 వరకు బీమా పరిహారం పొందే అవకాశం ఉందని వివరించారు.ఈ సందర్భంగా ఆక్షన్ సూపరింటెండెంట్ శ్రీ జి. రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రతి పొగాకు రైతు పొగాకు సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించుకుని, తన భూమి, నీటి వనరులు మరియు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కనీసం ఒక ప్రత్యామ్నాయ పంటను సాగు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల ద్వారా రైతులు ఆదాయ వనరులను విస్తరించుకుని, పొగాకు మార్కెట్‌పై పూర్తిగా ఆధారపడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ, పశుసంవర్ధక, పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది, పొగాకు రైతులు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం 

వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కళాశాల

వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కళాశాల 2026–27 విద్యా సంవత్సరం నుంచే తరగతులు – బి.కాం. (కంప్యూటర్ అప్లికేషన్స్)తో పాటు ఏఐ సర్టిఫికేషన్ కోర్సు విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ,ఆగస్టు 25. ( పున్నమి ప్రతినిధి) వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో ప్రత్యేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ (ఎఫ్‌.ఎ.సి.) ఎం. వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మహిళలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ (ప్రోగ్రామ్–II) జి.ఓ.ఎం.ఎస్. నం.16, తేదీ 31-07-2026 ద్వారా ఈ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రతిష్టాత్మక **“ఇంద్రధనుస్సు – దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం”**లో భాగంగా ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 30 సీట్లు.. ఏఐ సర్టిఫికేషన్ కోర్సు 2026–27 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమవుతాయని, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా **బి.కాం. (కంప్యూటర్ అప్లికేషన్స్)**తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సర్టిఫికేషన్ కోర్సు అందుబాటులో ఉంటుందని తెలిపారు. మొత్తం 30 సీట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వినికిడి లోపం ఉన్న విద్యార్థినీ, విద్యార్థుల నుంచి ఆగస్టు 23, 2026 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విజయనగరం జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా వినికిడి లోపం ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలను పొందేందుకు ఈ కళాశాల ఎంతో దోహదపడుతుందని విజయనగరం జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఆర్‌.ఎస్‌. మెస్సీ ఇవాంజెలిన్ తెలిపారు. విజయనగరం జిల్లాలోని అర్హులైన వినికిడి లోపం ఉన్న విద్యార్థులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాలు, దరఖాస్తుల కోసం ప్రభుత్వ వినికిడి లోపం ఉన్న విద్యార్థుల డిగ్రీ కళాశాల, వెదుళ్లపల్లి, బాపట్ల జిల్లా ప్రిన్సిపాల్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 90000 13633, 99483 72899