Monday, 17 August 2026

Tag: bpknews

పశ్చిమ గోదావరి

BPKNEWS: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక గ్రీటింగ్ సౌకర్యం

ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BPKNEWS ప్రత్యేకమైన Independence Day Greeting సేవను అందిస్తోంది. పాఠకులు తమ పేరును నమోదు చేసి ప్రత్యేక గ్రీటింగ్ పొందవచ్చు, డౌన్‌లోడ్ చేసుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవచ్చు. BPKNEWS స్థానిక వార్తలు, ప్రజలకు ఉపయోగపడే సమాచారం, అవగాహన కల్పించే కంటెంట్‌ను అందించడంలో పాఠకులు మరియు మద్దతుదారుల సహకారం ముఖ్యమని తెలిపింది. ఈ మద్దతు విలువైన జర్నలిజం మరియు సమాచారాన్ని సృష్టించడంలో సహాయపడుతుందని పేర్కొంది. Video Link: https://bpknewsofficial.blogspot.com/2026/08/independence-day-greetings-2026.html

పశ్చిమ గోదావరి

PMMSYలో మత్స్యకారులకు లభించే ప్రయోజనాలు వివరాలు

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) ద్వారా మత్స్యకారులకు వివిధ రకాల సబ్సిడీలు మరియు సహాయక చర్యలు అందుబాటులో ఉన్నాయి. ఈ యోజన కింద అర్హతలు, కావలసిన పత్రాలు, దరఖాస్తు ప్రక్రియలు వంటి వివరాలు సమగ్రంగా అందించబడుతున్నాయి. ఈ స్కీమ్ ద్వారా మత్స్యకారులకు ఆర్థిక సహాయం, ఆధునిక సౌకర్యాలు, మరియు మార్కెటింగ్ పరిరక్షణ వంటి లాభాలు కలుగజేయడం లక్ష్యంగా ఉంది. పూర్తి వివరాలు bpknewsofficial.blogspot.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి, అందులో దరఖాస్తు విధానం, సబ్సిడీ రేట్లు మరియు ఇతర కీలక సమాచారం వివరించబడింది. Video Link: https://bpknewsofficial.blogspot.com/2026/08/pradhan-mantri-matsya-sampada-yojana.html

Featured News Updates పశ్చిమ గోదావరి

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతి .. ఎమ్మెల్యే అంజిబాబు

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధాని అమరావతి అని, 5 కోట్ల ప్రజల ఆకాంక్ష .. అమరావతి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో గురువారం రాత్రి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు, పట్టణ ప్రజలతో సంబరాలను నిర్వహించారు. బాణా సంచా కాల్పులతో .. జై అమరావతి.. జై జై అమరావతి నినాదాలతో ప్రకాశం చౌక్ సెంటర్ అంతా మారుమ్రోగింది. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం రాజధాని అమరావతి అని, ఇది ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. లోక్‌ సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవమన్నారు. అమరావతి ఇక అజేయం, అజరామరమని, స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి అని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, రైతుల త్యాగాలకు (33,000 ఎకరాల భూసమీకరణ) దక్కిన చారిత్రాత్మక విజయమని అన్నారు. వైసీపీ నాయకులు ఏదో చేస్తామంటే ఏమి మారాదని, శాశ్వత రాజధాని అమరావతి అని అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ అమరావత్ రాజధానిగా ఎన్నికవడం శుభ సూచకమని, జై అమరావతి అని అన్నారు. అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్‌ ఇక దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైందని, ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం జై అమరావతి జై జై అమరావతి అంటూ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో వివిధ కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి

ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య

ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య ▪️ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో వ్యాయామ విద్య నేర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా యోగా, ఆరోగ్య విద్య, డ్రిల్, క్రీడలు నిర్వహించాలని సూచించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి తరగతికీ వారానికి ఆరు పీరియడ్లను ప్రత్యేకంగా వ్యాయామానికి కేటాయించాలని, ప్రతి విద్యార్థికీ రోజుకు కనీసం ఒకగంట శారీరక శ్రమ ఉండేలా చూడాలని ఆదేశించింది. పాఠశాల అసెంబ్లీలో ప్రతి రోజూ పది నిమిషాలు ధ్యానం, వారానికి ఒక పీరియడ్ను నిర్దేశించిన సిలబస్ మేరకు ఆరోగ్య విద్యకు కేటాయించాలని సూచించింది. ఈ మేరకు కాల నిర్ణయం పట్టికను విడుదల చేసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.