Wednesday, 23 September 2026

Tag: Birthday of Gurajada

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అభ్యుదయ అడుగుజాడ గురజాడ -డా. బద్రి పీర్ కుమార్

స్వర్గీయ గురజాడ వెంకట అప్పారావు విశాఖ జిల్లా యస్.రాయవరం లో తన మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబరు 21 న, వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. తెలుగు నాటక రంగంలోను సాహిత్య రంగంలోను విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహాకవి, నాటక రచయిత మరియు ప్రముఖ సంఘ సంస్కర్త గురజాడ. తెలుగు సాహిత్యానికి గ్రాంథిక భాషా శృంఖలాల నుండి విముక్తి కల్గించి వ్యావహారిక భాషలో అనగా ప్రజల వాడుక భాషలో రచనలు చేసిన యుగపురుషుడు. అప్పారావును ఆధునిక తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు గానూ ‘నవ్యకవితా పితామహుడు’, ‘అభ్యుదయ కవితా పితామహుడు’ మరియు ‘కవిశేఖర’ అని పిలుస్తారు. తెలుగు సాహిత్యంలో వ్యావహారిక భాషా ఉద్యమానికి ఊపిరి పోసి, సమాజంలోని దురాచారాలపై తన కలం ద్వారా పోరాడారు అప్పారావు. ఈయన చేసిన రచనలు తక్కువే అయినా, అవన్నీ అత్యంత ప్రసిద్ధమైన అమూల్యమైన సృజనలుగ చెప్పవచ్చు. గురజాడ అప్పారావు గారి ప్రముఖ రచనలు కన్యాశుల్కము, (1892 నాటకము), కొండుభట్టీయం (నాటకం), బిల్హణీయం (నాటకం), దేశమును ప్రేమించుమన్నా లాంటి ప్రసిద్ధ గేయాలు, కవితలు, కథానికలు మొదలైనవి మరియు ‘ముత్యాల సరాలు’ అనే సరికొత్త ఛందస్సును అనగా కవితా చరణాన్ని సృష్టించి ఆధునిక కవిత్వానికి సరికొత్త ఒరవడిని తెచ్చారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈ కవిత. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 మూఢనమ్మకాల సంకెళ్లు తెంచి కన్యాశుల్కపు కారుచీకట్లను చీల్చి సమాజ ప్రగతకి స్త్రీస్వేచ్ఛ కావాలని తలచి ప్రాచీన హద్దులు దాటించి వ్యావహారిక భాషకు పట్టంకట్టిన కవిశేఖరుడు ప్రజా ప్రయోజన నిస్వార్థ భావావేశం తెలుగు జగతి సంతసించు సత్సందేశం తోటిజనులను ప్రేమించమనే నిత్య ఆదేశం దేశభక్తి నింపిన చైతన్య ప్రకాశం ఆధునిక కవితా పితామహుడు తెలుగు హృదయాల్లో జ్ఞానదీపం నిలిపి మతాల కన్నా మానవత్వం మిన్న అని తెల్పి కలంతో కాంతి రేఖలు చెక్కిన సామాజిక శిల్పి దేశమంటే మట్టి కాదని మమతానురాగాల మందిరమన్న మహాకవి వినిపించే కవితాత్మక సాహిత్యం సంచలనం కనిపించే ప్రేరణాత్మక అనుకరణ భావనీరాజనం రాతలోనూ పలుకులోను ప్రతిబింబించే దేశాభిమానం గురజాడ అడుగుజాడను తెలిపే అమరత్వమైన కవితాభిమానం ఆ కలం నుండి జారిన ప్రతి అక్షరం అమరం మట్టిలోని మాణిక్యాల జాడతెలుసుకునే వరం అభ్యుదయం వైపు వేసిన ప్రతి అడుగు సంబరం నవయుగ వైతాళికుడిగ తెలుగుజాతి కీర్తించును నిరంతరం 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.