Wednesday, 23 September 2026

Tag: Baimuthaka Srinivasulu

సత్యసాయి

ప్రజాసేవలో ముందుకు సాగుతున్న బైముతక శ్రీనివాసులు

వెంకటాపురం గ్రామపంచాయతీ ఎంపీటీసీ సభ్యునిగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన టీడీపీ యువనేత బైముతక శ్రీనివాసులు ప్రజాసేవలో కొనసాగుతానని తెలిపారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఆయన 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబుళదేవర చెరువు మండలం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అవకాశం కల్పించిన ప్రజలు, ఓటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశిస్తే మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ స్వగ్రామం నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేపట్టిన సందర్భంలోనూ ఆయన పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరించారు. మరోవైపు మండల ప్రజాపరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవచ్చన్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పార్టీల కసరత్తు కూడా మొదలైంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.