Wednesday, 30 September 2026

Tag: Awards

నంద్యాల

ఉత్తమ అధికారిగా ఆలయ ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డికి పురస్కారం

నంద్యాల : ఆలయ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సేవలందిస్తున్న ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డికి ఉత్తమ అధికారిగా పురస్కారం లభించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఆలయ నిర్వహణలో క్రమశిక్షణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ అభివృద్ధి కార్యక్రమాల అమలులో చురుకైన పాత్ర పోషించినందుకు శ్రీనివాసరెడ్డిని అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా పురస్కారం అందుకున్న ఆయనకు ఆలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, భక్తులు శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు అందించిన ప్రోత్సాహం మరింత బాధ్యతతో పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.