Monday, 28 September 2026

Tag: స్పెల్ విజార్డ్ మోడల్ స్కూల్ చిప్పలపల్లి

రాజన్న సిరిసిల్ల

స్పెల్ విజార్డ్ లో పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

స్పెల్ విజార్డ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) సిరిసిల్ల, సెప్టెంబర్ 26: ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా), స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పీఎం శ్రీ పాఠశాలల స్పెల్ విజార్డ్ పోటీలు శనివారం సిరిసిల్లలోని ZPHS బాలికల పాఠశాలలో నిర్వహించారు. సీనియర్ విభాగంలో S.K. అయాన్ (TGMS సిరిసిల్ల) ప్రథమ, N. వర్ష (ZPHS రుద్రంగి) ద్వితీయ, D. వర్షిక (ZPHS హన్మాజిపేట) తృతీయ బహుమతులు సాధించారు. జూనియర్ విభాగంలో K. హరిచందన (MPPS చందుర్తి) ప్రథమ, G. శ్రేష్ఠ (MPPS కోనరావుపేట) ద్వితీయ, U. సాయిబాబా (MPPS పెద్దలింగాపూర్) తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు డీఈఓ మొండయ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ బచ్చు అశోక్, ఎల్టా అధ్యక్షులు చేరాల తిరుపతి, సభ్యులు వసంత్, సరిత, సుష్మిత, సునీత, కిరణ్, మురళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.