శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
విద్యుత్ షాక్‌తో దంపతుల మృతి
వాకాడు మండలం రావిగుంటపాలెం పంచాయతీ తీపలపూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ఈదురు కుమార్ (40), ఆయన భార్య పుష్ప (36) మృతి చెందారు. ఇంటర్మీడియట్ చదువుతున్న యశస్విని, తొమ్మిదో తరగతి చదువుతున్న తేజస్విని తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. బాలికల భవిష్యత్తుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దంపతుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని గ్రామస్థులు కోరారు
