Wednesday, 9 September 2026

Tag: ముస్తాబదులో కాలేజీకి ఘన నివాళి

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 9 పున్నమి ప్రతినిధి ముస్తాబాద్: ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, నిమ్మ రాజిరెడ్డి, ఉపాధ్యాయులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ఉపాధ్యాయులు దామెర శ్రీనివాస్ కాళోజీ సాహిత్యం, తెలంగాణ భాషా యాస గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. వ్యాసరచన, చిత్రలేఖనం, కవితా రచన పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.