రక్షాబంధన్ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్
భూపాలపల్లి, ఆగస్టు 28: భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, సోదరీమణులు చైర్మన్‌కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ మాట్లాడుతూ.. రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సమాజంలో మహిళలకు గౌరవం, భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు పరస్పర ప్రేమాభిమానాలతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


