Thursday, 1 October 2026

Tag: తెలంగాణ రాజకీయం ఇంద్రమ్మ ఇండ్ల పథకం స్టేషన్గన్పూర్ ఇప్పగూడెం

జనగాం

​రాజయ్య కారుకూతలు మానుకో: సర్పంచ్ మందపురం రాణి

​స్టేషన్ ఘన్‌పూర్, ఇప్పగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇందిరమ్మ ఇళ్లపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని సర్పంచ్ మందపురం రాణి-అనిల్ గౌడ్ మంగళవారం మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఇళ్ల మంజూరులో డబ్బులు వసూలు చేసినట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని, లేదంటే రాజయ్య రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్ విసిరారు. గత బిఆర్ఎస్ పాలనలో గ్రామానికి ఒక్క ఇల్లూ ఇవ్వని ఆయనకు మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషితో గ్రామానికి 94 ఇందిరమ్మ ఇళ్లు, రూ. 2.30 కోట్ల అభివృద్ధి పనులు వచ్చాయని, చిల్లర మాటలు మాని ఆధారాలతో మాట్లాడాలని హితవు పలికారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.