పందిల్లపల్లి ర్యాక్ పాయింట్‌కు 2,632.5 మెట్రిక్ టన్నుల యూరియా
చింతకాని / ఖమ్మం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిల్లపల్లి ర్యాక్ పాయింట్‌కు శుక్రవారం RFCL కంపెనీకి చెందిన 2,632.5 మెట్రిక్ టన్నుల యూరియా చేరినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 832.5 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 1,200 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 500 మెట్రిక్ టన్నులు, ఖమ్మం CRPకు 100 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు వెల్లడించారు. ఆయా జిల్లాల్లో అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ డీలర్లు, సహకార సంఘాలకు యూరియాను పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతులకు యూరియా కొరత లేకుండా సరఫరా కొనసాగిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. రైతులు యూరియాను నిబంధనల ప్రకారం కొనుగోలు చేసుకోవాలని సూచించారు.


